RITES Recruitment:  గురుగ్రామ్‌లోని రైల్ ఇండియా టెక్ని్కల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 11 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 108


పోస్టుల వారీగా ఖాళీలు..


⏩ రెసిడెంట్ ఇంజినీర్‌(CL/08/25): 11
పోస్టుల కెటాయింపు: యూఆర్- 06, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 03, ఎస్సీ- 01.
అర్హత: ఫుల్‌టైమ్ డిప్లొమా (మెకానికల్/సివిల్/ఇన్‌స్ట్రుమెంటన్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 11.03.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: బేసిక్ పే- నెలకు రూ.17,853; గ్రాస్ పే- నెలకు రూ.32,492; వార్షిక CTC- రూ.3,89,906.


⏩ రెసిడెంట్ ఇంజినీర్‌(CL/09/25): 03
పోస్టుల కెటాయింపు: యూఆర్- 03.
అర్హత: మెటలర్జికల్ / కెమికల్ / మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో ఫుల్‌టైమ్ డిగ్రీ లేదా ఫుల్‌టైమ్ ఎంఎస్సీ(కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 11.03.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: బేసిక్ పే- నెలకు రూ.23340; గ్రాస్ పే- నెలకు రూ.42,478; వార్షిక CTC- రూ.5.09 LPA.


⏩ రెసిడెంట్ ఇంజినీర్‌(CL/11/25): 14
పోస్టుల కెటాయింపు: యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 03, ఎస్సీ- 01, ఎస్టీ- 01.
అర్హత:ఫుల్‌టైమ్ డిప్లొమా (మెకానికల్/సివిల్/ఇంజినీరింగ్ బ్రాంచ్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 11.03.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: బేసిక్ పే- నెలకు రూ.16,828; గ్రాస్ పే- నెలకు రూ.30,627; వార్షిక CTC- రూ.3,67,523.


⏩ రెసిడెంట్ ఇంజినీర్‌(CL/06/25): 37
పోస్టుల కెటాయింపు: యూఆర్- 18, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 09, ఎస్సీ- 05, ఎస్టీ- 02.
అర్హత:మెటలర్జికల్/మెకానికల్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ఫుల్‌టైమ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 11.03.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: బేసిక్ పే- నెలకు రూ.23,340; గ్రాస్ పే- నెలకు రూ.42,478; వార్షిక CTC- రూ.5.09 LPA.


⏩ టెక్నీషియన్(CL/10/25): 03 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 03.
అర్హత: ఫుల్‌టైమ్ బీఎస్సీ(ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 11.03.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: బేసిక్ పే- నెలకు రూ.14,643; గ్రాస్ పే- నెలకు రూ.26,649; వార్షిక CTC- రూ.3,19,793.


⏩ టెక్నికల్ అసిస్టెంట్: 40 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 19, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 10, ఎస్సీ- 05, ఎస్టీ- 03. 
అర్హత: మెటలర్జికల్/మెకానికల్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ఫుల్‌టైమ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
అనుభవం: ఇన్‌స్పెక్షన్ & సూపర్‌విజన్ ఫీల్డ్‌లో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11.03.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: బేసిక్ పే- నెలకు రూ.16,338; గ్రాస్ పే- నెలకు రూ.29,735; వార్షిక CTC- రూ.356819.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. రెసిడెంట్ ఇంజినీర్‌(CL/09/25) పోస్టులకు ఫీజు లేదు.


ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.


పరీక్షా కేంద్రాలు: ఢిల్లీ/గురుగ్రామ్‌/ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, భిలాయ్.


ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.03.2025.


✦ తాత్కాలిక అడ్మిట్ కార్డు జారీ: 12.03.2025.


✦ తాత్కాలిక రాత పరీక్ష తేదీ: 23.03.2025.


✦ తాత్కాలిక ఇంటర్వ్యూ తేదీలు(CL/09/25, CL/06/25): 18.03.2025 నుంచి 21.03.2025 వరకు


CL/08/25, CL/10/25 Notification


CL/11/25 Notification


CL/09/25 Notification


CL/07/25 Notification


CL/06/25 Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..