దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాతపరీక్ష రివైజ్డ్‌ ఫలితాలును కేంద్రీయ విద్యాలయ సంగతన్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కొత్త జాబితా ప్రకారం మొత్తం 20234 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కేవీఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులకు నవంబరు 3 నుంచి 9 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు తర్వాతి దశలో క్లాస్ డెమో, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించిన తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి రూ.35,400-రూ.1,12,400 జీతం ఇస్తారు. 


రివైజ్డ్‌ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


కటాఫ్ మార్కులు..
అభ్యర్థులు కటాఫ్ మార్కులను పరిశీలిస్తే.. ఓసీలకు 134.9098, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 127.2099, ఎస్సీ అభ్యర్థులకు 121.3403, ఎస్టీ అభ్యర్థులకు 102.7499, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 127.2099, ఓహెచ్ అభ్యర్థులకు 118.1203, విజువల్ ఇంపేర్డ్ అభ్యర్థులకు 110.6335గా నిర్ణయించారు. 



కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్ గతేడాది డిసెంబరు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.  వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. టీచింగ్ పోస్టుల్లో అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), లైబ్రేరియన్,  ప్రైమరీ టీచర్ (మ్యూజిక్), ఫైనాన్స్ ఆఫీసర్,  అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో), హిందీ ట్రాన్స్‌లేటర్ (హెచ్‌టీ), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ-యూడీసీ),  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్ఏ-ఎల్‌డీసీ), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి.


ALSO READ: యూపీఎస్సీ సీడీఎస్ఈ (I)-2023 తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి


రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే టీచింగ్ పోస్టుల ఫలితాలు వెలువడగా.. పీఆర్టీ పోస్టుల ఫలితాలను తాజాగా విడుదల చేశారు.


ALSO READ: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్ - 2023 తుది ఫలితాలు విడుదల


ప్రైమరీ టీచర్ పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 2599 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 1731 పోస్టులు, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు 641 పోస్టులు, ఎస్సీ-962 పోస్టులు, ఎస్టీ-481 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5 నుంచి 2023, జనవరి 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. సీనియర్ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). (లేదా) సీనియర్ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పేపర్-1లో అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీల భర్తీచేయనున్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 19న పీఆర్టీ ఎంపిక జాబితాను కేవీఎస్ విడుదల చేసింది. అయితే తాజాగా ఫలితాలకు సంబంధించిన రివైడ్జ్ జాబితాను కేవీఎస్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను అందుబాటులో ఉంచింది.



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..