ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 291 


➥ ఆఫీసర్ గ్రేడ్-బి(డీఆర్): 222 పోస్టులు 


విభాగం: జనరల్.


➥ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి(డీఆర్): 38 పోస్టులు


విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ & పాలసీ రిసెర్చ్ (డీఈపీఆర్).


➥ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్): 31 పోస్టులు


విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఐఎం).


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.05.2023.


➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.06.2023.


➦ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) జనరల్:


↪ ఫేజ్-1 పరీక్ష తేదీ: 09.07.2023


↪ ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 30.07.2023.


➦ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) డీఈపీఆర్‌: 


↪ ఫేజ్-1 పరీక్ష తేదీ: 16.07.2023


↪ ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 02.09.2023.


➦ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం:


↪ ఫేజ్-1 పరీక్ష తేదీ: 16.07.2023


↪ ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 19.08.2023.


Website




Also Read:


కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల, అడ్మిట్‌కార్డులు అందుబాటులో!
సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు.
అడ్మిట్ కార్డులు, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సీఎంఎస్-2023 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 1261 పోస్టుల భర్తీ!
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి మే 9న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..