RBI Assistant Mains Examination Halltickets: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రధాన రాతపరీక్ష(Mains) అడ్మిట్‌కార్డులు డిసెంబరు 19న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రోల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్‌ 31న నిర్వహించే ప్రధాన పరీక్ష(Mains) నిర్వహించనున్నారు. ఆర్‌బీఐలో అసిస్టెంట్ పోస్టులకు నవంబర్‌ 18, 19 తేదీల్లో ప్రాథమిక పరీక్ష (Prelimis) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించినవారికి చివరగా.. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.


అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


మెయిన్ పరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు


దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55700 జీతంగా ఇస్తారు. 


పోస్టుల వివరాలు..


 అసిస్టెంట్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 450


శాఖల వారీగా ఖాళీలు..


➥ అహ్మదాబాద్: 13


➥ బెంగళూరు: 58


➥ భోపాల్: 12


➥ భువనేశ్వర్: 19


➥ చండీగఢ్: 21


➥ చెన్నై: 01


➥ గువాహటి: 26


➥ హైదరాబాద్: 14


➥ జైపుర్: 5


➥ జమ్మూ: 18


➥ కాన్పుర్ & లక్నో: 55


➥ కోల్‌కతా: 22


➥ ముంబయి: 101


➥ నాగ్‌పుర్: 19


➥ న్యూఢిల్లీ: 28


➥ పట్నా: 01


➥ తిరువనంతపురం & కొచ్చి: 16


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. 
ఇంటర్వ్యూ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...