హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిసెర్చ్ సెంటర్‌ ఐమరత్‌(ఆర్‌సీఐ) వివిధ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.  


వివరాలు..


మొత్తం ఖాళీలు: 150


➥ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 30


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.


స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.


➥ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(డిప్లొమా): 30


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.


➥ ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఐటీఐ): 90


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.


స్టైపెండ్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం.


వయోపరిమితి: 01.06.2023 నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.


ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 30.05.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 19.06.2023.


Notification


Website 


Online Registration (B.E / B.Tech /Diploma candidates)
Online Registration (ITI trade) 



Also Read:


ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తపాలా శాఖలో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. దీంతో పాటు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాలి.
నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..