తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్సు పోస్టులను ఆన్‌లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 40,936 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష నిర్వహించేందుకు హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పేర్కొన్న మంత్రి.. అత్యంత పారదర్శకంగా, పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.


వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 5,204 పోస్టులు


1) స్టాఫ్ నర్స్: 3,823 పోస్టులు
విభాగం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.


2) స్టాఫ్ నర్స్: 757 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్యవిధాన పరిషత్. 


3) స్టాఫ్ నర్స్: 81 పోస్టులు
విభాగం: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్.


4) స్టాఫ్ నర్స్: 08 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్.


5) స్టాఫ్ నర్స్: 127 పోస్టులు
విభాగం: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


6) స్టాఫ్ నర్స్: 197 పోస్టులు
విభాగం: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


7) స్టాఫ్ నర్స్: 74 పోస్టులు
విభాగం: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం).


8) స్టాఫ్ నర్స్: 124 పోస్టులు
విభాగం: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


9) స్టాఫ్ నర్స్: 13 పోస్టులు
విభాగం: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.


Also Read:


టీఎస్‌పీఎస్సీకి మే 'పరీక్షా'కాలం, పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణ! మే నెలలో 7 పరీక్షలు!
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు నియామక పరీక్షలన్నీ వాయిదాపడ్డాయి. అప్పటికే నిర్వహించిన పరీక్షలతోపాటు, భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మే నెలలో వివిధ నియామక పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తులు ప్రారంభించింది. మే 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలో 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా 7 పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో అత్యధికంగా 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుంది. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


ఎన్‌సీఈఆర్‌టీలో 347 ఉద్యోగాలు- వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీచేస్తారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..