AP DME Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (APDME) డైరెక్ట్ ఎంట్రీ, లేటరల్ ఎంట్రీ ద్వారా కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 29 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ అర్హతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 29.
మెడికల్ కాలేజీలవారీగా ఖాళీలు: ఆదోని-06, మార్కాపురం-03, మదనపల్లి-04, పులివెందుల-09, పాడేరు-07.
స్పెషాలిటీలవారీగా ఖాళీలు..
➥ మైక్రోబయాలజీ: 07
➥ ఫార్మకాలజీ: 06
➥ అనాటమీ: 03
➥ బయోకెమిస్ట్రీ: 06
➥ ఫిజియాలజీ: 07
అర్హతలు..
⫸ మైక్రోబయాలజీ అండ్ ఫార్మకాలజీ విభాగానికి పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి.
⫸ అనాటమీ విభాగానికి ఎండీ/ఎంఎస్ (అనాటమీ) లేదా ఎంఎస్సీ(మెడికల్ అనాటమీ) తోపాటు పీహెచ్‌డీ (మెడికల్ అనాటమీ)/ ఎంఎస్సీ (మెడికల్ అనాటమీ)తోపాటు డీఎస్సీ (మెడికల్ అనాటమీ) ఉత్తీర్ణులై ఉండాలి.
⫸ బయోకెమిస్ట్రీ విభాగానికి ఎండీ (బయోకెమిస్ట్రీ) లేదా ఎంఎస్సీ (మెడికల్ బయోకెమిస్ట్రీ)తోపాటు పీహెచ్‌డీ (మెడికల్ బయోకెమిస్ట్రీ)/ ఎంఎస్సీ(మెడికల్ బయోకెమిస్ట్రీ)తోపాటు డీఎస్సీ (మెడికల్ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
⫸ ఫిజియాలజీ విభాగానికి ఎండీ (ఫిజియాలజీ) లేదా ఎంఎస్సీ (మెడికల్ ఫిజియాలజీ)తోపాటు పీహెచ్‌డీ (మెడికల్ ఫిజియాలజీ)/ ఎంఎస్సీ(మెడికల్ ఫిజియాలజీ)తోపాటు డీఎస్సీ (మెడికల్ ఫిజియాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి..
⫸ జనరల్ అభ్యర్థులు 42 సంవత్సరాలకు మించకూడదు. 01.07.1981 తర్వాత జన్మించి ఉండాలి.
⫸ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలలోపు ఉండాలి. 01.07.1976 తర్వాత జన్మించి ఉండాలి.
⫸ దివ్యాంగ అభ్యర్థులు 52 సంవత్సరాలలోపు ఉండాలి. 01.07.1971 తర్వాత జన్మించి ఉండాలి.
⫸ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి. 01.07.1973 తర్వాత జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో అకడమిక్ మెరిట్‌కు 75 మార్కులు, 10 మార్కులు అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటి నుండి ఉన్న సంవత్సరాలకు వెయిటేజీ ఉంటుంది. ఇక 15 మార్కులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన అనుభవానికి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు..
- పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో
- ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
- ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్
- పీజీ డిగ్రీ సర్టిఫికేట్/సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్
- పీజీ డిగ్రీ మార్కుల మెమో/ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ మార్కుల మెమో
- ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- సీనియర్ రెసిడెన్సీ కంప్లీషన్ సర్టిఫికేట్
- 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీసర్టిఫికేట్ (తెలంగాణలో చదివినవారు మైగ్రేషన్‌కు సంబంధించి, సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి.)
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారు (DR/LE) సంబంధిత యాజమాన్యాల నుంచి NOC తీసుకోవాల్సి ఉంటుంది.
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం అన్ని డాక్యమెంట్లను, అవసరమైతే సంతకం చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్
- ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
- క్యాస్ట్ సర్టిఫికేట్ (SC/ST/BC) లేదా EWS అయితే సోషల్ స్టేటస్ సర్టిఫికేట్
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.05.2024.