RDMHS Recruitment: రాజమహేంద్రవరంలోని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్-2 కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీపీఈడీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతలో సాధించిన మార్కులు, తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 04
* ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు
జోన్-2 పరిధిలోని జిల్లాలు: తూర్పుగోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్.
అర్హత: డిగ్రీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ &ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.300 "Regional Director Medical & Health Services, Zone – II, Rajamahendravaram" పేరిట డీడీ తీయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Regional Director of Medical and
Health Services, Zone-II,
Rajamahendravaram.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.
➥ సంబంధిత పోస్ట్ కోసం నిర్దేశించిన ఉత్తీర్ణత సర్టిఫికేట్‌లు
➥ అన్ని సంవత్సరాల అర్హత పరీక్ష లేదా దానికి సమానమైన మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి.
➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.
➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.
➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).
➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.
➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు.
➥ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
ముఖ్యమైనతేదీలు..
🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.02.2024.
🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 20.02.2024.
ALSO READ:
శ్రీసత్యసాయి జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
WDCW Recruitment: శ్రీసత్యసాయి(పుట్టపర్తి)లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన శ్రీసత్యసాయి జిల్లాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో- సోషల్ కౌన్సెలర్, ఆఫీస్ అసిస్టెంట్, ఎంటీఎస్(కుక్), సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి హైస్కూల్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.