రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టుని అనుసరించి వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును అనుసరించి యూజీసీ నెట్/ గేట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించి నిర్ణిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 25


పోస్టుల వారీగా ఖాళీలు..


ఎ. బయోసేఫ్టీ సపోర్ట్ యూనిట్(BSU) - ఫేజ్-II


1. చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్: 01


2. ప్రాజెక్ట్ సైంటిస్ట్(III/II/ I): 10


3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01 


4. ప్రాజెక్ట్ అసోసియేట్ II: 02


5. ప్రాజెక్ట్ అసోసియేట్ I: 02


6. ఎగ్జిక్యూటివ్(అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్& సర్వీసెస్): 01

7. వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేటర్: 01


8. ఎగ్జిక్యూటివ్ (IPR): 01


9. ఎగ్జిక్యూటివ్ (లీగల్): 01


బి. డీబీటీ-హెచ్‌ఆర్‌డీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్(PMU)


1. గ్రాంట్స్ అడ్వైజర్: 02


2. సిస్టమ్స్ అనలిస్ట్: 01


3. అకౌంట్స్ అసిస్టెంట్: 01


4. టెక్నకల్ అసిస్టెంట్(ఐటి & సపోర్ట్ సర్వీసెస్): 01


అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీకామ్/ బీఎస్సీ/ బీబీఏ/ ఎల్ఎల్‌బీ/ ఎంసీఏ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ/ డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 35-45 ఏళ్లు ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.31000-రూ.2 లక్షలు చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1000.


ఎంపిక విధానం: పోస్టును అనుసరించి సంస్థ నిబంధనలతో పాటు యూజీసీ నెట్/ గేట్ అర్హత సాధించాలి.


దరఖాస్తు చివరితేది: 23.12.2022.


Notification 


Online Application


Website  


Also Read:


నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్, కోర్టుల్లో 4600 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం!
తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. మరో వైపు కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదాలు లభిస్తున్నాయి. తాజాగా, మరో 4600కుపై ఉద్యోగాలకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం (డిసెంబరు 12) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లయింది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...