RBI Officer Grade-B Final Results: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌ (గ్రేడ్‌-బి) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 291 ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 9న ప్రిలిమినరీ పరీక్ష, జులై 30న మెయిన్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా తుది ఫలితాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ. 83,254 వేతనం అందుతుంది.


గ్రేడ్-బి ఆఫీసర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..




వివరాలు...


* మొత్తం ఖాళీలు: 291 


➥ ఆఫీసర్ గ్రేడ్-బి(డీఆర్): 222 పోస్టులు 


విభాగం: జనరల్.


➥ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి(డీఆర్): 38 పోస్టులు


విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ & పాలసీ రిసెర్చ్ (డీఈపీఆర్).


➥ ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్): 31 పోస్టులు


విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఐఎం).


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


ALSO READ:


స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 92 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, నెలకు రూ.1.8 లక్షల వరకు జీతం
భారత ప్రభుత్వరంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 11న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 127 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి డిసెంబరు 27లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...