RFCL Recruitment: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL) రామగుండం ప్లాంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రోఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, డిప్లొమా, సీఏ, సీఎంఏ,, ఎంబీఏ, సివిల్), ఎంబీబీఎస్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు: ఇ-5 నుంచి ఇ-7 పోస్టులకు రూ.1000. ఇ-1 నుంచి ఇ-4 పోస్టులకు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు  దరఖాస్తులు సమర్పించవచ్చు.

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, మెటీరియల్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, సివిల్, మెడికల్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.

వివరాలు..


ఖాళీల సంఖ్య: 40

⏩ కెమికల్ విభాగం 


➥ ఇంజినీర్‌(ఇ-1): 05


➥ సీనియర్‌ మేనేజర్‌(ఇ-5): 02


➥ చీఫ్‌ మేనేజర్‌(ఇ-6): 01


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఇ-7): 01


⏩ మెకానికల్ విభాగం


➥ ఇంజినీర్‌(ఇ-1): 02


➥ మేనేజర్‌(ఇ-4): 01


➥ సీనియర్‌ మేనేజర్‌(ఇ-5): 01


➥ చీఫ్‌ మేనేజర్‌(ఇ-6): 01


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఇ-7): 01


⏩ ఎలక్ట్రికల్ విభాగం


➥ ఇంజినీర్‌(ఇ-1): 02


➥ చీఫ్‌ మేనేజర్‌(ఇ-6): 01


⏩ ఇన్‌‌స్ట్రుమెంటేషన్ విభాగం


➥ ఇంజినీర్‌(ఇ-1): 02


⏩ మెటీరియల్స్ విభాగం


➥ చీఫ్‌ మేనేజర్‌(ఇ-6): 02


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఇ-7): 01


⏩ ఫైనాన్స్ & అకౌంట్స్ (ఎఫ్&ఎ) విభాగం


➥ చీఫ్‌ మేనేజర్‌(ఇ-6): 01


⏩ సివిల్ విభాగం


➥ ఇంజినీర్‌(ఇ-1): 02


➥ డిప్యూటీ మేనేజర్ (ఇ-3): 01


➥ చీఫ్‌ మేనేజర్‌(ఇ-6): 01


⏩ మెడికల్ విభాగం


➥ మెడికల్ ఆఫీసర్ (ఇ-1): 01


➥ సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఇ-2): 01


➥ డిప్యూటీ సిఎంఓ(ఇ-3): 01


➥ అడిషనల్ సీఎంఓ(ఇ-4): 01


➥ సిఎంఓ(ఇ-5): 01


⏩ సేఫ్టీ విభాగం


➥ అసిస్టెంట్ మేనేజర్ (ఇ-2): 02


➥ మేనేజర్ (ఇ-4): 01


⏩ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం


➥ ఇంజినీర్ (ఇ-1): 01


➥ అసిస్టెంట్ మేనేజర్ (ఇ-2): 01


➥ మేనేజర్ (ఇ-4): 01


➥ సీనియర్ మేనేజర్ (ఇ-5): 01


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, డిప్లొమా, సీఏ, సీఎంఏ,, ఎంబీఏ, సివిల్), ఎంబీబీఎస్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ఇంజినీర్‌కు 30 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, డిప్యూటీ సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 40 సంవత్సరాలు, అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్‌, సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌కు 45 సంవత్సరాలు, చీఫ్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 50 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: ఇ-5 నుంచి ఇ-7 పోస్టులకు రూ.1000. ఇ-1 నుంచి ఇ-4 పోస్టులకు రూ.700. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్- సర్వీస్‌మెన్/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం:  ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతం: నెలకు పోస్ట్ కోడ్ ఇ-1కు రూ.40,000 - రూ.1,40,000, ఇ-2కు రూ.50,000 - రూ.1,60,000, ఇ-3కు రూ.60,000 - రూ.1,80,000, ఇ-4కు రూ.70,000 - రూ.2,00,000, ఇ-5కు రూ.80,000 - రూ.2,20,000, ఇ-6కు రూ. 90,000 - రూ.2,40,000, ఇ-7కు రూ.1,00,000 - రూ.2,60,000.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2025.


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2025.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..