దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఫిబ్రవరి 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), సికింద్రాబాద్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లెవెల్-1 ఖాళీలకు సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు(దివ్యాంగులు మినహా) జనవరి 12 నుంచి 22 వరకు శారీరక సామర్థ్య పరీక్షలను ఆర్‌ఆర్‌సీ నిర్వహించింది.


శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 9303 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో పీడబ్ల్యూడీ విభాగంలో 100 మంది, సీసీఏఏ విభాగంలో 987 మంది, ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగంలో 55, నాన్ పీడబ్ల్యూడీ విభాగంలో 8161 మంది అభ్యర్థులు ఉన్నారు. కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులు సైతం వెల్లడించింది. పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 7 నుంచి వైద్య పరీక్షలతో పాటు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తేదీలు, నిర్వహణ ప్రాంతం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆర్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్/మెయిల్ ద్వారా కాల్‌లెటర్ డౌన్‌లోడ్ సమాచారం పంపనున్నారు.


డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు వెంట తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..
➥ సర్టిఫికేట్లు, మార్కుషీట్లు
➥ లీగల్ డాక్యుమెంట్స్ (పేపరు మార్చుకున్నట్లయితే)
➥ పుట్టినతేదీ సర్టిఫికేట్లు 
➥ ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం 
➥ ఓబీసీ-ఎన్‌సీఎల్ సర్టిఫికేట్
➥ డిజెబిలిటీ సర్టిఫికేట్
➥ ఫొటో ఐడీకార్డు 
➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటోలు 6 తీసుకురావాలి. 
➥ ఆదాయ ధ్రువీకరణ పత్రం
➥ ప్రస్తుతం రైల్వే శాఖలో పనిచేస్తున్నవారైతే NOC సర్టిఫికేట్ ఉండాలి.
➥ సెల్ఫ్ డిక్లరేష్ అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్/ ఎక్స్-సర్వీస్‌మెన్ అయితే NOC సర్టిఫికేట్ ఉండాలి.
➥ట్రాన్స్‌జెండర్ అయితే సెల్ఫ్ సర్టిఫికేట్ ఉండాలి.

1,03,769 గ్రూప్-డి పోస్టులకు పరీక్ష..
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. 


గ్రూప్-డి పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. డిసెంబరు 23న ఫలితాలను విడుదల చేశారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 21 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 7 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 



Also Read:


'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియను అధికారులు పొడిగించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జనవరి 30 వరకే దరఖాస్తుకు అవకాశం ఉంది. అయితే దరఖాస్తు సమయంలో సాంకేతిక కారణాల వల్ల అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో మరో నాలుగురోజులపాటు పొడిగిస్తూ నిర్ణయంతీసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 8 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. దరఖాస్తుకు మరో నాలుగురోజులు గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య దాదాపుగా 10 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.   
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...