Rail India Technical and Economic Service Recruitment: గురుగ్రామ్(హరియాణా)లోని రైట్స్ (RITES) లిమిటెడ్- ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(Apprenticeship Training)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్/నాన్-ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ (Diploma Apprentice), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice) ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు సంబంధిత వెబ్‌పోర్టల్‌ల ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు డిసెంబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 257.
పోస్టుల కేటాయింపు: యూఆర్-133, ఈడబ్ల్యూఎస్-19, ఓబీసీ-62, ఎస్టీ-11, ఎస్సీ-31.
కేటగిరీ వారీగా ఖాళీలు..
➥ గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) అప్రెంటిస్: 117
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం, మెకానికల్, కెమికల్/ మెటలర్జికల్.
అర్హత: సంబంధిత విభాగంలో నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.14,000.
➥ గ్రాడ్యుయేట్ (నాన్-ఇంజినీరింగ్) అప్రెంటిస్: 43
విభాగాలు: ఫైనాన్స్, హెచ్‌ఆర్.
అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిగ్రీ (బీఏ/బీబీఏ/బీకామ్) ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.14,000.
➥ డిప్లొమా అప్రెంటిస్: 28
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం, మెకానికల్, కెమికల్/ మెటలర్జికల్.
అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.12,000.
➥ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 69
విభాగాలు: సివిల్, ఎలక్ట్రీషియన్, క్యాడ్ ఆపరేటర్/ డ్రాఫ్ట్స్‌మన్, ఇతర ట్రేడ్లు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.10,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. సంబంధిత వెబ్‌పోర్టల్‌ల ద్వారా దరఖాస్తులు సమర్పించినవారు రైట్ వెబ్‌సైట్ ద్వారా గూగుల్ ఫామ్ ద్వారా స్కాన్డ్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.12.2023.
NATS Portal - Application (Engineering Degree/ Diploma)
NAPS Portal - Application (ITI Pass or Graduate BA/BBA/B.Com)
ALSO READ:
నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ప్రయాగ్‌రాజ్ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న నార్త్ సెంట్రల్ రైల్వే(NCR)- రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
కోల్‌కతా ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్ట్రన్ రైల్వే (SER)-రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..