PNB Apprentice Recruitment 2024 Registration: న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.944 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.708 చెల్లించాలి. ఇక దివ్యాంగులకు రూ.472 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.10,000; పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000. మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

వివరాలు..

* అప్రెంటిస్‌ పోస్టులు (Apprentice)

ఖాళీల సంఖ్య: 2,700 

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు..

➥ అండమాన్ నికోబార్:  02

➥ ఆంధ్రప్రదేశ్: 27

➥ అరుణాచల్ ప్రదేశ్: 04

➥ అస్సాం: 27

➥ బిహార్: 79

➥ చండీగఢ్: 19

➥ ఛత్తీస్ గఢ్: 51

➥ డామన్ & డయ్యూ: 04   

➥ ఢిల్లీ: 178

➥ గోవా: 04

➥ గుజరాత్: 117

➥ హర్యానా: 226

➥ హిమాచల్ ప్రదేశ్: 83

➥ జమ్మూ కశ్మీర్: 26

➥ జార్ఖండ్: 19

కర్ణాటక: 32

➥ కేరళ: 22

➥ లడఖ్: 02

➥ మధ్యప్రదేశ్: 133

➥ మహారాష్ట్ర: 145

➥ మణిపూర్: 06

➥ మేఘాలయ: 02

➥ మిజోరం: 02

➥ నాగాలాండ్: 02

➥ ఒడిశా: 71

➥ పుదుచ్చేరి: 02

➥ పంజాబ్: 251

➥ రాజస్థాన్: 206

➥ సిక్కిం: 04

➥ తమిళనాడు: 34

➥ తెలంగాణ: 34

➥ త్రిపుర: 13

➥ ఉత్తర్ ప్రదేశ్: 561

➥ ఉత్తరాఖండ్: 48

➥ వెస్ట్ బెంగాల్: 236

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 30.06.2024 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.944. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.708. దివ్యాంగులకు రూ.472.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

ఆన్‌లైన్ రాతపరీక్ష: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్‌ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్ / హిందీ.

స్టైపెండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000. పట్టణ ప్రాంతానికి రూ.12,000. మెట్రో ప్రాంతానికి రూ.15,000.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.06.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 14.07.2024.

➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 28.07.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..