న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, బీసీఏ, బీటెక్‌, బీకామ్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్‌, ఎంసీఏ, ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.  


వివరాలు..


మొత్తం ఖాళీలు: 37


పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, మేనేజర్.


విభాగాలు: ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ, ఫైనాన్స్ & అకౌంట్స్, లీగల్, ఐటీ &ఎంఐఎస్, మీడియా & పీఆర్, లాజిస్టిక్స్ & సప్లై చైన్, సేల్స్ & మార్కెటింగ్, ఇంటర్‌నేషనల్ అసిస్టెంట్స్ డివిజన్. 


అర్హత: పోస్టును అనుసరించి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, బీసీఏ, బీటెక్‌, బీకామ్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్‌, ఎంసీఏ, ఎంటెక్‌ ఉత్తీర్ణత. 


వయోపరిమితి: నిబంధనల మేరకు.


దరఖాస్తు విధానం: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.25000-రూ.80000 చెల్లిస్తారు.


ఈమెయిల్: recruitment@janaushadhi.gov.in


చిరునామా: CEO, PMBI at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi - 110055.


దరఖాస్తు చివరి తేది: 22.06.2023.


Notification 
 


Website


Also Read:


DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి మే 25న నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి 21 రోజుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


నాగ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) రెగ్యులర్, డిప్యూటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ(గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్‌, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తులను గూగుల్‌ ఫాం ద్వారా సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..