పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ రీజియన్లు/ కార్పొరేట్ టెలికాం డిపార్టుమెంటులో రీజినల్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్లొమా ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
వివరాలు..
డిప్లొమా ట్రైనీ
రీజియన్లు: నార్తెర్న్, ఈస్టెర్న్, సదరన్, వెస్ట్రన్, కార్పొరేట్ సెంటర్.
మొత్తం ఖాళీలు: 211
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్(పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2022 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు
జీత భత్యాలు: నెలకు రూ.25,000 - రూ.1,17,500 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2022.
రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి-2023.
Also Read:
SSC CHSL-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..