సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా విభాగాల్లో మొత్తంగా 10,15,237 పోస్టులకు గాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 83 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఉద్యోగ ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్ విభాగాలు ఉన్నాయి.
మొత్తం మంజూరైన ఉద్యోగాల్లో ప్రస్తుతం 83,127 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. అయితే, గతేడాది జులై నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో 32,181 పోస్టుల్ని భర్తీ చేయగా.. అదనంగా 64,444 ఖాళీలను నోటిఫై చేశామన్నారు. ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ వివిధ దశల్లో ఉందని.. 2023లోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
అలాగే, ఈ ఉద్యోగ ఖాళీల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఓవర్ టైమ్ పనిచేస్తున్నారని అనడం సరికాదన్నారు. సాయుధ బలగాల్లోని ఆయా విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ.. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, సంబంధిత బలగాల ద్వారా ఖాళీల్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Also Read:
Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!
కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ.. ఇండియన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో చేరాలనుకునే వారికి మొదట ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్(సీఈఈ) నిర్వహించనుంది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC Exams: సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
సీజీఎల్ టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన టైర్-2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 6న ప్రకటించింది. వీటిలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-2 పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ఫిబ్రవరి 6న ప్రకటించింది. అలాగే, 4500 లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్-1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, జనవరి 21 నుంచి దరఖాస్తులు!
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..