Apprenticeship Training in East Central Railway: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,832 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అడకమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభంకాగా.. డిసెంబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1,832.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్.
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)- 851, ఓబీసీ-467, ఎస్సీ-247, ఎస్టీ-111, ఈడబ్ల్యూఎస్-156.
డివిజన్/యూనిట్లవారీగా ఖాళీలు:
➥ దనాపూర్ డివిజన్: 675
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 201, వెల్డర్ - 08, మెకానిక్ (డీజిల్) - 37, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్ - 75, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ - 24, కార్పెంటర్ - 09, ఎలక్ట్రానిక్ (మెకానిక్) - 142, పెయింటర్ (జనరల్) - 07, ఎలక్ట్రీషియన్ - 146, వైర్‌మ్యాన్ - 26.
➥ ధన్‌బాద్ డివిజన్: 156
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 41, టర్నర్ - 23, మెషినిస్ట్ - 07, వెల్డర్ - 44, మెకానిక్ (డీజిల్) - 15, కార్పెంటర్ - 04, వైర్‌మ్యాన్ - 22.
➥ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్: 518
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 285, మెషినిస్ట్ - 02, వెల్డర్ - 14, ఎలక్ట్రీషియన్ - 23, ఎంఎంటీఎం - 01, టర్నర్ - 03, వైర్‌మ్యాన్ - 40, మెకానిక్ (రిఫ్రిజిరేషన్ & ఏసీ) - 12, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 92, మెకానిక్ (డీజిల్) - 46.
➥ సోన్‌పూర్ డివిజన్: 47
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 21, బ్లాక్ స్మిత్ - 05, వెల్డర్ - 06, పెయింటర్ - 09, కార్పెంటర్ - 06.
➥ సమస్తిపూర్ డివిజన్: 81
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 16, టర్నర్ - 05, వెల్డర్ - 05, ఎలక్ట్రీషియన్ - 12, ఎలక్ట్రానిక్స్/మెకానికల్ - 12, పెయింటర్(జనరల్) - 02, కార్పెంటర్ - 02, మెకానికల్ (డీజిల్) - 22, ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 05.
➥ ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ: 135
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 58, మెషినిస్ట్ - 13, వెల్డర్ - 13, ఎలక్ట్రీషియన్ - 05, మెషినిస్ట్/గ్రిండర్ - 15, టర్నర్ - 13, మెకానిక్ (మోటార్ వెహికిల్) - 09, మెకానికల్ (డీజిల్) - 09.
➥ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (హర్నౌట్): 110
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 74, మెషినిస్ట్ - 12, వెల్డర్ - 16, ఎలక్ట్రీషియన్ - 08.
➥ మెకానికల్ వర్క్‌షాప్(సమస్తిపూర్): 110
ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 55, మెషినిస్ట్ - 11, వెల్డర్ - 35, ఎలక్ట్రీషియన్ - 09.
అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు యూఆర్- 10 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అడకమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 09.12.2023.
ALSO READ:
➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
➥ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు
➥ గుంటూరు జిల్లాలో మెడికల్, పారామెడికల్ పోస్టులు - ఈ అర్హతలుండాలి