విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందని, నర్సింగ్‌ వృత్తిలో నైపుణ్యం, అనుభవంతో పాటు విదేశీ భాషా ప్రావీణ్యం ఉంటే, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిణి అన్నారు. బుధవారం (జనవరి 11) తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌) ఆధ్వర్యంలో ‘విదేశాలలో ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు ’ అనే అంశంపై గాంధీ వైద్య కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా తరువాత అనేక దేశాలలో ఆరోగ్య రంగంలో నైపుణ్యత గల సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారికి టామ్‌కామ్‌ శిక్షణ ఇవ్వడానికి అన్ని జిల్లాలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె వెల్లడించారు . టామ్‌కామ్‌ సీఈవో విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 12 దేశాల్లోని అధికారిక కన్సల్టెన్సీలతో  ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.


ఆయా దేశాల భాషపై ఆరు నెలల శిక్షణ అనంతరం వారికి గ్యారంటీగా ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నామని వివరించారు. అమెరికా, కెనడా దేశాలకు స్క్రీనింగ్‌ ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. ఈ సదస్సులో తెలంగాణ నర్సింగ్‌ విభాగం రిజిస్ట్రార్‌ విద్యావతి, డిప్యూటీ డైరెక్టర్‌ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.


Also Read:


వైద్యారోగ్యశాఖలో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌! 
తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబరు 30) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ మెడికల్‌హెల్త్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ & బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...