NTPC Executive Jobs: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
పోస్టులను బట్టి విద్యార్హత మారుతోంది. బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరీల వారు రూ.300 ఫీజు చెల్లించాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం http://ntpc.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు: 22
ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్): ఇందులో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వయోపరిమితి 35 ఏళ్లుగా ఉంది. సంబంధిత రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ): ఇందులో ఓ అండ్ ఎమ్ విభాగంలో ఒక పోస్టు, ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి, ప్రాజెక్టు మానిటరింగ్ విభాగంలో ఒక పోస్టు ఉన్నాయి. దీనికి వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్దేశించారు. సంబంధిత రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ అనలిస్ట్): ఇందులో ఒక పోస్టు ఉంది. వయో పరిమితి 40 ఏళ్లుగా నిర్దేశించారు. సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (సోలార్): ఇందులో కూడా ఒక్క పోస్టు ఉంది. 10 ఏళ్ల అనుభవం (ఇందులో 4 ఏళ్లు సంబంధిత విభాగంలోనే ఉండటం తప్పనిసరి) అవసరం. వయోపరిమితి 56 ఏళ్లుగా ఉంది.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కంపెనీ సెక్రటరీ): ఇందులో ఒక్క పోస్టు ఉంది. సంబంధిత విభాగంలో కనీసం 20 ఏళ్లు అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి 56 ఏళ్లుగా ఉంది.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్): ఒక పోస్టు ఉంది. సంబంధిత విభాగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. గరిష్ట వయో పరిమితి 56 ఏళ్లు.
ఎగ్జిక్యూటివ్ (క్లీన్ టెక్నాలజీస్): ఈ విభాగంలోనూ 1 పోస్టు ఉంది. కనీసం 5 ఏళ్లు (ఇందులో కనీసం 3 ఏళ్లు సంబంధిత విభాగంలో అవసరం) అనుభవం తప్పనిసరి. గరిష్ట వయో పరిమితి 56 ఏళ్లుగా ఉంది.
గమనిక: రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.
నేవీ ఉద్యోగాలకు ముగియనున్న దరఖాస్తు గడువు..
ఇండియన్ నేవీ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన వారి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 30వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 40 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు