NTPC: ఎన్‌టీపీసీలో జీడీఎంఓ, మెడికల్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి

NTPC Jobs: ఎన్‌టీపీసీ ఖాళీగా ఉన్న జీడీఎంఓ/ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

NTPC Recruitment: న్యూ ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) ఖాళీగా ఉన్న జీడీఎంఓ/ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 81

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ జీడీఎంఓ: 20
పోస్టుల కేటాయింపు: యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 08, ఎస్సీ- 02.
అర్హత: గుర్తిపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ ఫిజిషియన్‌: 25
పోస్టుల కేటాయింపు: యూఆర్- 10, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 08, ఎస్సీ- 03, ఎస్టీ- 02.
అర్హత: జనరల్ మెడిసిన్(ఎండీ/ డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ పీడియాట్రిషియన్: 10
పోస్టుల కేటాయింపు: యూఆర్- 07, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 02.
అర్హత: పీడియాట్రిక్స్(ఎండీ/ డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా(చైల్డ్ హెల్త్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

⏩ రేడియాలజిస్ట్‌: 04
పోస్టుల కేటాయింపు: యూఆర్- 03, ఓబీసీ- 01.
అర్హత: రేడియాలజీ(ఎండీ/ డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా(రేడియాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

⏩ ఆర్థోపెడిక్స్‌: 06
పోస్టుల కేటాయింపు: యూఆర్- 05, ఎస్సీ- 01.
అర్హత: ఆర్థోపెడిక్స్(ఎంఎస్/ డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా(ఆర్థోపెడిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

⏩ ఆప్తల్మాలజిస్ట్‌: 04
పోస్టుల కేటాయింపు: యూఆర్- 03, ఓబీసీ- 01.
అర్హత: ఆప్తల్మాలజీ(ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా(ఆప్తల్మాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

⏩ ఓ అండ్‌ జీ: 10
పోస్టుల కేటాయింపు: యూఆర్- 06, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 03.
అర్హత: ఓ అండ్‌ జీ(ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా(ఓ అండ్‌ జీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

⏩ ఈఎన్‌టీ: 02
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01, ఓబీసీ- 01.
అర్హత: ఈఎన్‌టీ(ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా(ఈఎన్‌టీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 37 సంవత్సరాలు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ విద్యార్హతలు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

జీతం: నెలకు జీడీఎంఓ పోస్టులకు రూ.50,000- రూ.1,60,000; మెడికల్‌ స్పెషలిస్ట్‌లకు రూ70,000 - రూ.1,80,000.

అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్‌లు..

➥ పేరు, పుట్టిన తేదీ ధృవీకరణ కోసం X క్లాస్, XII క్లాస్ పాస్‌సర్టిఫికేట్/మార్కుషీట్

➥ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు.

➥ ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డిప్లొమా అన్ని మార్కుషీట్‌లు

➥ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్

➥ వాలిడ్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

➥ కాస్ట్/డిజబిలిటి సర్టిఫికెట్(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు)

➥ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్

➥ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికెట్

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola