ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అటల్ నగర్‌లోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఎస్టీ, ఓబీసీ- ఎన్‌సీఎల్ అభ్యర్థులకు సంబంధించి బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ కేటగిరీలో ఖాళీగా ఉన్న డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ, ఐటీఐ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 11
ఎన్‌టీపీసీ ప్రాజెక్ట్: ఖర్గోన్, గదర్వారా, లారా.
➥ డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ: 9 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్ ఐ.
➥ ఐటీఐ ట్రైనీ: 2 పోస్టులు
విభాగాలు: ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ టెక్నికల్ టెస్ట్. ఐటీఐ ట్రైనీలకు ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు.
జీత భత్యాలు: నెలకు డిప్లొమా ఇంజినీర్ ట్రైనీకి రూ.24000. ఐటీఐ ట్రైనీకి రూ.21500.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 12.08.2023.
ALSO READ:
కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..