NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటి/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 8వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 20 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 10, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతనం: నెలకు రూ.60,000 - రూ.1,80,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.02.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.03.2024.
ALSO READ:
ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
SBI Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(అప్లికేషన్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 04 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్ంగ్, ఇంటర్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 అప్రెంటిస్ ఖాళీలు, డిగ్రీ అర్హత చాలు
Central Bank of India Recruitment: ముంబయి ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్(రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్) సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా పలు రీజియన్లలోని శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3 వేల అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి 100 పోస్టులు, తెలంగాణకు 96 పోస్టులు కేటాయించారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులకు మార్చి 10న ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..