NTPC Jobs 2024: న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుద‌ల చేసింది. దీనిద్వారా జీడీఎంవో, జ‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జరీ, అనస్థీషియా రేడియాల‌జీ విభాగాల్లో మొత్తం 61 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు: రూ.300. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. సరైన అర్హతలున్నవారు జ‌న‌వ‌రి 24 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* మెడిక‌ల్ స్పెషలిస్ట్ పోస్టులు


మొత్తం ఖాళీల సంఖ్య: 61


విభాగాలవారీగా ఖాళీలు..


1) జీడీఎంవో: 20 పోస్టులు


అర్హత: ఎంబీబీఎస్.


అనుభవం: ఎంబీబీఎస్ తర్వాత కనీసం 2 సంవత్సరాల మెడికల్ ప్రాక్టీస్ ఉండాలి.


2) జ‌న‌ర‌ల్ మెడిసిన్: 25 పోస్టులు 


అర్హత: ఎండీ/డీఎన్‌బీ(జ‌న‌ర‌ల్ మెడిసిన్).


అనుభవం: ఎంఎస్/డీఎన్‌బీ తర్వాత కనీసం ఏడాది అనుభవం ఉండాలి.


3) జ‌న‌ర‌ల్ స‌ర్జరీ: 07 పోస్టులు 


అర్హత: ఎంఎస్/డీఎన్‌బీ (జ‌న‌ర‌ల్ సర్జరీ).


అనుభవం: ఎంఎస్/డీఎన్‌బీ తర్వాత కనీసం ఏడాది అనుభవం ఉండాలి.


4) అనస్థీషియా: 05 పోస్టులు 


అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్‌తోపాటు పీజీ డిప్లొమా (అనస్థీషియా) ఉండాలి.


అనుభవం: ఎండీ/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్ తర్వాత కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.


5) రేడియాల‌జిస్ట్: 04 పోస్టులు   


అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్‌తోపాటు పీజీ డిప్లొమా (రేడియోలజీ) ఉండాలి.


అనుభవం: ఎండీ/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్ తర్వాత కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 37 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు: రూ.300. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


పే స్కేల్: మెడికల్ ఆఫీసర్ మరియు మెడికల్ స్పెషలిస్ట్‌లకు నెలకు రూ.50,000- రూ.2,00,000. చెల్లిస్తారు.


దరఖాస్తు్కు చివరితేదీ: 24.01.2024.


Notification


Online Application 


Website 


ALSO READ:


రైల్వే శాఖలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని కేటాయించారంటే?
RRB ALP Recruitment 2024 Notification: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,696 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ జోన్‌ పరిధిలో 758 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 199 పోస్టులు, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 559 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిభ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.


మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .