NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ వపర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.55,000 జీతంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తారు.


వివరాలు..


* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్)


ఖాళీల సంఖ్య: 223 పోస్టులు.


పోస్టుల కేటాయింపు: యూఆర్-98, ఈడబ్ల్యూఎస్-22, ఓబీస-40, ఎస్సీ-39, ఎస్టీ-24.


కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.


అర్హత: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.


అనుభవం: పవర్ ప్లాంట్ ఆపరేషన్/మెయింటెనన్స్ విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.


జీత భత్యాలు: నెలకు రూ.55,000.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2024.


Notification


Online Application


Website


ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ డేటా సైన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ డేటా ఇంజినీరింగ్ పోస్టులు
NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ వపర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ డేటా సైన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ డేటా ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి బీఈ/ బీటెక్‌ లేదా ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా ) కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 24న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 04


* ఎగ్జిక్యూటివ్ డేటా సైన్స్-02 


అర్హత: ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ లేదా ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా(డేటా సైన్స్/డేటా అనలిటిక్స్/ఐటీ/సీఎస్) కలిగి ఉండాలి.


అనుభవం: 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 


* ఎగ్జిక్యూటివ్ డేటా ఇంజినీరింగ్- 02.   


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/ బీటెక్‌ లేదా ఎంసీఏ కలిగి ఉండాలి.


అనుభవం: 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


వేతనం: రూ.100000.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.02.2024.


Notification


Online Application


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...