NTPCREL Notification: న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 63 ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 21న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

వివరాలు..

* ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 63.

పోస్టుల కేటాయింపు: జనరల్-35, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-14, ఎస్సీ-08, ఎస్టీ-03.

➥ ఇంజినీర్: 60 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: సివిల్-20, ఎలక్ట్రికల్-29, మెకానికల్-09, సీడీఎం-01, ఐటీ-01.


అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఐటీ). సీడీఎం విభాగానికి ఇంజినీరింగ్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్)


అనుభవం: సంబంధిత విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. సీడీఎం విభాగానికి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. సీడీఎం విభాగానికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.

➥ ఎగ్జిక్యూటివ్‌: 03 పోస్టులు


విభాగాలు: హెచ్‌ఆర్‌-01, పైనాన్స్‌-01, కార్పొరేట్‌ కమ్యూనికేషన్-01.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 60 శాతం మార్కులతో డిగ్రీతోపాటు మేనేజ్‌మెంట్ విభాగంలో రెండేళ్ల పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. హెచ్‌ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్) లేదా ఎంహెచ్‌ఆర్‌వోడీ లేదా ఎంబీఏ (హెచ్ఆర్) అర్హత ఉండాలి. 


అనుభవం: హెచ్‌ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ,  మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధాన: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు రూ.83,000.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.


➥ దరఖాస్తు చివరి తేదీ: 13-04-2024.


Notification


Online Application


Website


ALSO READ:


నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టులు - దరఖాస్తు వివరాలివే!
నవోదయ విద్యాలయ సమితిలో భారీగా నాన్-టీచింగ్ (గ్రూప్-బి, గ్రూప్-సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 22న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రాతపరీక్ష ద్వారా, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...