Telangana Universities VCs Notification: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల(వీసీల) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్‌), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్‌), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్‌)లకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకానికి విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.


సెర్చ్‌ కమిటీ ద్వారా ఎంపిక..
వీసీల ఎంపిక ప్రక్రియను సెర్చ్‌ కమిటీలు చేపడుతాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో వర్సిటీకి ముగ్గురితో సెర్చ్‌ కమిటీ ఏర్పడుతుంది. వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేస్తుంది. ప్రభుత్వ నామిని, యూజీసీ చైర్మన్‌ నామిని, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) నామినీలతో ఈ సెర్చ్‌ కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ సమావేశమై అందరి బయోడేటాలను పరిశీలించి, ముగ్గురు పేర్లను వీసీగా నియమించేందుకు సూచిస్తారు. కనీసం ప్రొఫెసర్‌ 10 సంవత్సరాలుగా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదేండ్ల అనుభవం కలిగి ఉండాలి. వీసీని మూడేండ్ల కాల పరిమితికి నియమిస్తారు. కాల పరిమితి ముగియగానే వైదొలగాల్సి ఉంటుంది.


ఉమ్మడి పరీక్షలకు కన్వీనర్లు నియామకం..
తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(CET)లకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఆయా సెట్లను నిర్వహించే వర్సిటీల వివరాలనూ వెల్లడించింది. టీఎస్​ఈఏపీసెట్, పీజీఈసెట్‌లను జేఎన్టీయూహెచ్‌కు, ఐసెట్ కాకతీయకు, ఈసెట్, లాసెట్‌లను ఉస్మానియాకు, ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ వర్సిటీకి, పీఈసెట్‌ను శాతవాహన వర్సిటీకి కేటాయించింది. ఈఏపీసెట్ కన్వీనర్​గా ప్రొఫెసర్ దీన్ కుమార్​ను, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​ను ఈసెట్ కన్వీనర్​గా, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్​ విజయలక్ష్మిని లాసెట్ కన్వీనర్​గా నియమించారు. పీజీఈసెట్ కన్వీనర్ గా అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్‌గా నరసింహాచారి. పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ మృణాళిని నియమితులయ్యారు.


ALSO READ:


ఓయూలో దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు టీఎస్‌ఐసెట్/ఏపీ ఐసెట్ అర్హత తప్పనిసరి. వేదిక్ ఆస్ట్రాలజీ కోర్సుకు సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా మార్చి 31 వరకు  దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. 
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..