AP DSC 2024 Notification: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి.  వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలల్లో 4566 ఖాళీలు ఉన్నాయి. ఇక ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో 1534 ఖాళీలు ఉన్నాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే ఫిబ్రవరి 21లోగా నిర్ణీత ఫీజు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఆయాతేదీల్లో మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తదనంతరం మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇక ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

వివరాలు..

* ఏపీ డీఎస్సీ (TRT) నోటిఫికేషన్ -  2024

మొత్తం ఖాళీల సంఖ్య: 6100

➥ ఎస్టీజీ: 2280 పోస్టులు

➥ స్కూల్ అసిస్టెంట్: 2299 పోస్టులు

➥ టీజీటీ: 1264 పోస్టులు

➥ పీజీటీ: 215 పోస్టులు

➥ ప్రిన్సిపల్: 42 పోస్టులు

ప్రభుత్వ/జిల్లాపరిషత్/మండల పరిషత్ / మున్సిపల్/ ఆశ్రమ పాఠశాలలు: 4566 పోస్టులు

1)  స్కూల్ ఎడ్యుకేషన్ (ప్రభుత్వ/జిల్లాపరిషత్/మండల పరిషత్ పాఠశాలలు): 3453 పోస్టులు

జిల్లా ఎస్‌ఏ ఎస్జీటీ మొత్తం
శ్రీకాకుళం 70 51 121
విజయనగరం 16 38 54
విశాఖపట్నం 69 14 83
తూర్పుగోదావరి 119 22 141
పశ్చిమగోదావరి 115 68 183
కృష్ణా 71 82 153
గుంటూరు 115 79 194
ప్రకాశం 279 88 367
నెల్లూరు 120 95 215
చిత్తూరు 48 84 132
కడప 75 80 155
అనంతపురం 126 15 141
కర్నూలు 502 1012 1514
మొత్తం ఖాళీలు 1725 1728 3453

2) స్కూల్ ఎడ్యుకేషన్ (మున్సిపల్ పాఠశాలలు): 607 పోస్టులు

జిల్లా ఎస్‌ఏ ఎస్జీటీ మొత్తం
శ్రీకాకుళం 7 20 27
విజయనగరం 3 24 27
విశాఖపట్నం 16 - 16
తూర్పుగోదావరి 62 20 82
పశ్చిమగోదావరి 25 20 45
కృష్ణా 36 20 56
గుంటూరు 48 20 68
ప్రకాశం 11 10 21
నెల్లూరు 17 7 24
చిత్తూరు 29 20 49
కడప 19 20 39
అనంతపురం 35 91 126
కర్నూలు 27 - 27
మొత్తం ఖాళీలు 334 272 607

3) ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ( ఆశ్రమ పాఠశాలలు): 506 పోస్టులు

జిల్లా ఎస్‌ఏ ఎస్జీటీ మొత్తం
శ్రీకాకుళం 52 33 85
విజయనగరం 77 41 118
విశాఖపట్నం 47 87 134
తూర్పుగోదావరి - 66 66
పశ్చిమగోదావరి 4 14 18
కృష్ణా 03 01 04
గుంటూరు 6 10 16
ప్రకాశం 08 13 21
నెల్లూరు 02 02 04
చిత్తూరు 01 02 03
కడప 03 01 04
అనంతపురం 02 01 03
కర్నూలు 20 10 30
మొత్తం ఖాళీలు 226 280 506

అర్హతలు..

➥ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. (లేదా) బీసీఏ/బీబీఎంతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఇంటర్ స్థాయిలో సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి.

➥ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు రెండేళ్ల డీఎడ్/ డీఎల్‌ఈడీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

➙ ఓసీ అభ్యర్థులు 01.07.1980 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

➙ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 01.07.1975 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

➙ దివ్యాంగులు 01.07.1970 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (డీఎస్సీ) ద్వారా.

రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్టీ)కు 80 మార్కులు, ఏపీటెట్‌కు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. అయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాత్రం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. 

ముఖ్యమైన తేదీలు..

విషయం తేదీ
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 12.02.2024.
ఫీజుచెల్లింపు తేదీలు 12.02.2024 - 21.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 22.02.2024.
ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో 24.02.2024.
పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ 05.03.2024 నుంచి.
ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: 
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్)
ప్రిలిమినరీ ఆన్సర్ కీ వెల్లడి 31.03.2024.
ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.
ఫైనల్ కీ వెల్లడి 08.04.2024
డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి 15.04.2024 

DSC 2024 School Education Notification

DSC 2024 School Education Information Bulletin

Online Application