హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా జేటీ. కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(పర్సనల్), జూనియర్ మేనేజర్ (కెమికల్), జూనియర్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్), జూనియర్ మేనేజర్ (రాజ్‌భాష) పోస్టులను వివిధ ప్రాజెక్ట్‌లు/ యూనిట్లు/కార్యాలయాలలో భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి 10+2, గ్రాడ్యుయేషన్, లా డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎంఎస్సీ(కెమిస్ట్రీ)/కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ఎంఏ(హిందీ) ఉత్తీర్ణత ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధలను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబరు 25 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 11                


పోస్టుల వారీగా ఖాళీలు..


1) జేటీ. కంపెనీ సెక్రటరీ: 01


అర్హత: 
(i) గ్రాడ్యుయేట్(సీఎస్(ఫైనల్)) ఉత్తీర్ణత ఉండాలి.


 (ii) అభ్యర్థి తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్‌లో అసోసియేట్ మెంబర్‌గా ఉండాలి.


 (iii) సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ(ఫైనాన్స్) వంటి అదనపు అర్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు.

2) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా): 01


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి హెచ్‌ఎస్‌సీ(10+2), డిగ్రీతోపాటు మూడేళ్లా లా డిగ్రీ ఉండాలి. లేదా 5 ఏళ్ల లా డిగ్రీ (ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఉత్తీర్ణులై ఉండాలి.


3) అసిస్టెంట్ జనరల్ మేనేజర్(పర్సనల్): 03
అర్హత: 
(i) గ్రాడ్యుయేషన్
(ii) సోషియాలజీ/సోషల్ వర్క్/లేబర్ వెల్ఫేర్/పర్సనల్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ ఐఆర్/ఐఆర్‌పీఎం/హెచ్‌ఆర్/హెఛ్ఆర్‌ఎం లేదా ఎంబీఏ (పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్‌ఆర్/హెఛ్ఆర్‌ఎం) ఉత్తీర్ణత ఉండాలి.


4) జూనియర్ మేనేజర్ (కెమికల్): 01
అర్హత: ఎంఎస్సీ(కెమిస్ట్రీ)/కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


5) జూనియర్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్): 03
అర్హత: సివిల్/కెమికల్/మైనింగ్/ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ(ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్/ ఇంజనీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/జియాలజీ/కెమిస్ట్రీ/బోటనీ) లేదా పీజీ డిగ్రీ/డిప్లొమా(ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌)  లేదా ఎన్విరాన్‌మెంట్ స్టడీస్/ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌లో డాక్టరేట్ ఉండాలి.


6) జూనియర్ మేనేజర్ (రాజ్‌భాష): 02
అర్హత: ఎంఏ.(హిందీ), గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి డిగ్రీలో ఒక సబ్జెక్ట్‌గా ఇంగ్లీషు ఉండాలి.


వయోపరిమితి: 30-45 ఏళ్లు మించకూడదు.


జీతభత్యాలు: నెలకు రూ.50,000-రూ.2.6లక్షలు చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్ఎండీసీ లిమిటెడ్ యొక్క డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహయింపు ఉంది.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ: 05.11.2022 


ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 25.11.2022.


Notification 


Online Application 


Website 


Also Read:


SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


JIPMER Jobs: జిప్‌మర్‌‌లో 433 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబర్ 1లోగా దరఖాస్తుచేసుకోవాలి. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...