NLCIL Jobs: తమిళనాడు రాష్ట్రం కడలూరులోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీఐఎల్) గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 295 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 295
* గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు
➥ థర్మల్ పవర్ స్టేషన్లు & రీన్యూయబల్ ఎనర్జి(ఏరియా-1*): 140
మెకానికల్: 36
ఎలక్ట్రికల్: 71
సివిల్: 15
కంప్యూటర్: 18
➥ మైన్స్ & అల్లైడ్ సర్వీసెస్(ఏరియా-2**): 155
మెకానికల్: 84
ఎలక్ట్రికల్: 38
సివిల్: 13
మైనింగ్: 17
కంప్యూటర్: 03
అర్హత:
మెకానికల్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
ఎలక్ట్రికల్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
సివిల్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో సివిల్ ఇంజినీరింగ్/సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
మైనింగ్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
కంప్యూటర్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 1.11.2023 నాటికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) దరఖాస్తు ఫీజు రూ.500+ ప్రాసెసింగ్ ఫీజు రూ.354= రూ.854. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.12.2023.
Also Read:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 110 ఆపరేటర్, టెక్నీషియన్ పోస్టులు
SAIL Recruitment Notification: రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (Operator-cum-Technician), అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (Attendant-cum-Technician) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి మెట్రిక్యులేషన్/10వ తరగతితో పాటు సంబంధిత విభాగాలలో డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply