NLC: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 171 ఉద్యోగాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

NLC Notification: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC India Limited) ఖాళీగా ఉన్న జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌, మైనింగ్‌ సర్దార్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

Continues below advertisement

NLC Recruitment: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC India Limited) ఖాళీగా ఉన్న జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌, మైనింగ్‌ సర్దార్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 171 పోస్టులను భర్తీ చేయనున్నారు. మైనింగ్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో  డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే ఓవర్‌మ్యాన్, మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభంకానుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 171

⏩ జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌(ట్రైనీ): 69 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 31, ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 18, ఎస్సీ- 13, ఎస్టీ- 01.

అర్హతలు: 

➥ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన డిప్లొమా (మైనింగ్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్) లేదా లేదా ఇతర తత్సమాన విద్యార్హత ఉండాలి. 

➥ కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం DGMS నుంచి చెల్లుబాటు అయ్యే ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ లేదా కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం ఓవర్‌మ్యాన్‌గా పనిచేయడానికి అర్హత ఉన్న మైనింగ్‌లో ఏదైనా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ చెల్లుబాటు అయ్యే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.04.2025 నాటికి యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.595, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.295.

పే స్కేల్‌: నెలకు రూ.31,000- రూ.1,00,000.

⏩ మైనింగ్‌ సర్దార్‌(సెలక్షన్ గ్రేడ్-I): 102 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 59, ఈడబ్ల్యూఎస్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 08, ఎస్సీ- 24, ఎస్టీ- 01.

అర్హతలు: 

➥ మైనింగ్ ఇంజనీరింగ్ కాకుండా ఏదైనా సబ్జెక్టులో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి. 

➥ DGMS జారీ చేసిన మైనింగ్ సిర్దార్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

➥ చెల్లుబాటు అయ్యే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. (లేదా)

➥ DGMS జారీ చేసిన ఓవర్‌మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌తో పాటు డిప్లొమా (మైనింగ్) కలిగి ఉండాలి. 

➥ చెల్లుబాటు అయ్యే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.04.2025 నాటికి యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.486; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.236.

పే స్కేల్‌: నెలకు రూ.26,000- రూ.1,10,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-I, Part-II రెండు విభాగాలుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100- ప్రశ్నలు, 100- మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్ష సమయం: 120 నిమిషాలు. ప్రశ్నపత్రం ఆంగ్ల భాషలో మాత్రమే ఉంటుంది.

పార్ట్-I: 30 ప్రశ్నలు(జనరల్ ఆప్టిట్యూడ్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ (డిప్లొమా స్థాయిలో) ఉంటాయి.

Part-II: 70 ప్రశ్నలు(విషయ పరిజ్ఞానం) 

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.04.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2025.

Notification

Website

Continues below advertisement
Sponsored Links by Taboola