ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా చేయబోయే కొత్త సినిమా ఖరారు అయింది. 'పుష్ప 2 ది రూల్' తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది? అనే ప్రశ్నకు సమాధానం లభించింది.‌ తమిళ దర్శకుడు అట్లీతో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అందులో నిజం ఎంత ఉందంటే? 

అల్లు అర్జున్ సినిమాలో ప్రియాంక చోప్రా!?తెలుగు ప్రేక్షకులకు ప్రియాంక చోప్రా గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలతో ఆవిడ తెలుగు ప్రజలకు సైతం దగ్గర అయింది. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ గ్లోబల్ ఆడియన్స్ అందరికీ తెలిసింది. అటువంటి ప్రియాంకను హీరోయిన్ రోల్ కోసం అల్లు అర్జున్ అండ్ అట్లీ టీం అప్రోచ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఆవిడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. అయితే అందులో నిజం లేదని ఐకాన్ స్టార్ టీం తెలిపింది.

ప్రియాంక చోప్రాను దర్శకుడు అట్లీ అప్రోచ్ అయిన విషయం నిజమే. కానీ, అల్లు అర్జున్ హీరోగా తీయబోయే సినిమా కోసం ఆమెను సంప్రదించలేదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా దర్శకత్వం వహించిన 'జవాన్' సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో, ఆ హిట్ తర్వాత మరొక ఖాన్ హీరో నుంచి అట్లీకి పిలుపు వచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఆయన సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ సరసన హీరోయిన్ రోల్ కోసం ప్రియాంక చోప్రాను అట్లీ అప్రోచ్ అయ్యారట. అయితే... సెట్స్ మీదకు వెళ్ళకముందు సినిమా క్యాన్సిల్ అయింది. 

అల్లు అర్జున్ సినిమాలో ప్రియాంక చోప్రా నటించే అవకాశం లేదని ఐకాన్ స్టార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Readఓటీటీలోకి ఈ వారమే 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా...అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా గురించి ప్రకటన రానుంది. హీరోగా బన్నీ 22వ సినిమా (AA22) అయితే... దర్శకుడుగా అట్లీకి ఇది 6వ సినిమా (A6). బన్నీ బర్త్ డే అయినటువంటి ఏప్రిల్ 8న సినిమా గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అధినేత కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తారు. దీనికి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. ఏప్రిల్ 8న ధమాకాకు రెడీ కావాలని అభిమానులకు బన్నీ వాసు సహా సన్ పిక్చర్స్ కూడా ట్వీట్ చేసింది. 

Also Readమంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?