NITW Recruitment: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (NIT)  డైరెక్ట్‌ / డిప్యూటేషన్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 07 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 56


* గ్రూప్‌-ఎ పోస్టులు


⏩ ప్రిన్సిపల్ సైంటిఫిక్‌ / టెక్నికల్‌ ఆఫీసర్‌: 03 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02 పోస్టులు, ఓబీసీ- 01 పోస్టు.
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు.
వేతనం: రూ.1,44,200 + DA + అలవెన్సులు.


⏩ ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎఎస్‌): 01 పోస్టు
రిజర్వేషన్: యూఆర్- 01 పోస్టు.
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు.
వేతనం: రూ.1,44,200 + DA + అలవెన్సులు.


⏩ డిప్యూటీ రిజిస్ట్రార్‌: 01
అర్హత: ఏదైనా విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.78,800+ DA + అలవెన్సులు.


⏩ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(సివిల్): 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్‌ మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.56,100+ DA + అలవెన్సులు.


⏩ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 పోస్టు
అర్హత: ఏదైనా విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, మేనేజ్‌మెంట్/ ఇంజినీరింగ్/ లా విభాగంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు.
వేతనం: రూ.56,100+ DA + అలవెన్సులు.



* గ్రూప్‌-బి పోస్టులు


⏩ అసిస్టెంట్ ఇంజినీర్‌: 03(సివిల్- 02 పోస్టులు, ఎలక్ట్రికల్- 01 పోస్టు)
అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్‌ మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు.
వేతనం: రూ.44,900+ DA + అలవెన్సులు.


⏩ సూపరింటెండెంట్: 05 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 03 పోస్టులు, ఓబీసీ- 01 పోస్టు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమానం లేదా కనీసం 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పాటు పని అనుభవం ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ వంటి కంప్యూటర్ అప్లికేషన్‌ల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.35,400+ DA + అలవెన్సులు.


⏩ జూనియర్‌ ఇంజినీర్‌: 03 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్‌ మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ వంటి కంప్యూటర్ అప్లికేషన్‌ల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.35,400+ DA + అలవెన్సులు.


⏩ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 పోస్టు
రిజర్వేషన్: పీడబ్ల్యూడీ- 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫస్ట్ క్లాస్‌ మార్కులతో సైన్స్/ఆర్ట్స్/కామర్స్‌ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్‌వర్కింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీజీడీసీఏ లేదా తత్సమానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.35,400+ DA + అలవెన్సులు.


⏩ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్‌ స్పోర్ట్స్‌ అసిస్టెంట్(ఎస్‌ఎఎస్‌): 01 పోస్టు
రిజర్వేషన్: ఓబీసీ- 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. స్పోర్ట్స్ అండ్ డ్రామా/మ్యూజిక్/ఫిల్మ్స్/పెయింటింగ్/ఫోటోగ్రఫీ/జర్నలిజం ఈవెంట్ మేనేజ్‌మెంట్/ఈవెంట్ మేనేజ్‌మెంట్/ఈవెంట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలలో పాల్గొన్న రికార్డు ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.35,400+ DA + అలవెన్సులు.


* గ్రూప్‌-సి పోస్టులు


⏩ సీనియర్‌ అసిస్టెంట్: 08 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 05 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు, ఎస్సీ-01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ఱతతో పాటు టైపింగ్, కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్‌షీట్‌లో ప్రావీణ్యం, కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.25,500+ DA + అలవెన్సులు.


⏩ జూనియర్‌ అసిస్టెంట్: 05 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ఱతతో పాటు టైపింగ్, కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్‌షీట్‌లో ప్రావీణ్యం, కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.21,700+ DA + అలవెన్సులు.


⏩ ఆఫీస్‌ అటెండెంట్: 10 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 06 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు, ఎస్సీ-01 పోస్టు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ఱత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.18,000+ DA + అలవెన్సులు.


⏩ ల్యాబ్‌ అసిస్టెంట్: 13 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 05 పోస్టులు, ఓబీసీ- 04 పోస్టులు, ఎస్సీ-02 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ఱత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.18,000+ DA + అలవెన్సులు.


దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఎ పోస్టులకు రూ.1000; గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులకు రూ.500 చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.01.2025.


Notification


Online Application


Website