అగర్తలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 27

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-I)

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-II)

విభాగాల వారీగా ఖాళీలు..

➤ సివిల్ ఇంజినీరింగ్: 05

➤ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 05

➤ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 07

➤ ఎలక్ట్రానిక్స్ & కమ్యనికేషన్ ఇంజినీరింగ్: 04

➤ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01

➤ మెకానికల్ ఇంజినీరింగ్: 02

➤ ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 01

➤ ఫిజిక్స్: 01

➤ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండర్ CSE: 01

అర్హతలు: సంబంధిత రంగంలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కనీసం 60% మార్కులతో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి అకడమిక్ రికార్డ్ మరియు పరిశోధన అనుభవం ఉండాలి. ఎక్స్‌లెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, బోధన మరియు మార్గదర్శకత్వం పట్ల మక్కువ కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి రూ.500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

జీతం: 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-I):  పే లెవెల్ 12- రూ.8000.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-II)): పే లెవెల్ 11- రూ.7000.; పే లెవెల్ 10- రూ.6000.

ఉద్యోగ బాధ్యతలు:

➥ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపన్యాసాలు అందించడం మరియు ప్రయోగశాల సెషన్‌లను నిర్వహించడం.

➥ వినూత్న బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం.

➥ బీటెక్, ఎంటెక్ మరియు పీహెచ్‌డీ పరిశోధన ప్రాజెక్టుల పర్యవేక్షణ.

➥ మీ నైపుణ్యం ఉన్న ప్రాంతంలో పరిశోధనలను నిర్వహించడం.

➥ ప్రఖ్యాత పత్రికలు మరియు సమావేశాలలో పరిశోధనా పత్రాలను ప్రచురించడం.

➥ పాఠ్యాంశాల అభివృద్ధి మరియు ప్రోగ్రామ్ మెరుగుదలకు సహకరించడం.

➥ డిపార్ట్‌మెంటల్ మరియు ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాల్లో పాల్గొనడం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.01.2024.  

Notification

Website

ALSO READ:

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 85 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలిముంబయిలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- జీఐసీఆర్ఈ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...