చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌(ఎన్‌ఐఆర్‌టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో హైస్కూల్‌, మెట్రిక్యులేషన్‌,ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, బీఎస్సీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా సంబంధిత ధృవపత్రాలను వ్యక్తిగతంగా సమర్పించాలి. 


వివరాలు..


పోస్టులు.. 


➥ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 


➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్ III 


➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్ III 


➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్ II 


➥ ప్రాజెక్ట్ డ్రైవర్ కమ్ మెకానిక్


➥ ప్రాజెక్ట్ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్


విభాగాలు..


➥ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్


➥ లేబొరేటరీ టెక్నీషియన్


➥ ఎక్స్-రే టెక్నీషియన్


➥ హెల్త్ అసిస్టెంట్


➥ హెల్పర్


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో హైస్కూల్‌, మెట్రిక్యులేషన్‌,ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, బీఎస్సీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 25-30 ఏళ్లు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, కలర్ ఫోటో అతికించారు. వాక్‌ఇన్‌ రిపోర్టింగ్ సమయంలో దరఖాస్తుతోపాటు అవసరమైన అన్ని సెల్ఫ్-అటెస్టేషన్ కాపీలను, ఒరిజినల్ ధ్రువపత్రాలు వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.  


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ఆధారంగా ఎంపిక ఉంటుంది


జీతభత్యాలు: నెలకు రూ.15800-రూ.31000 చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: ICMR-NATIONAL INSTITUTE FOR RESEARCH IN TUBERCULOSIS, 
                      NO.1, MAYOR SATHYMOORTHY ROAD, CHETPET, CHENNAI: 600031.


ఇంటర్వ్యూ తేది: 16, 19, 21, 23, 26.06.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9-10 వరకు.


Notification
Website


Also Read:


ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌, గేట్‌/ జెస్ట్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..