పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 22
* రిసెర్చ్ అసోసియేట్: 12 పోస్టులు
* రిసెర్చ్ ఫెలో: 10 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్, గేట్/ జెస్ట్‌తో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 26.06.2023 నాటికి ఆర్‌ఏ పోస్టులకు 35 సంవత్సరాలు; ఆర్‌ఎఫ్ పోస్టులకు 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు: నెలకు ఆర్‌ఏ పోస్టులకు రూ.47,000; ఆర్‌ఎఫ్ పోస్టులకు రూ.31,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.06.2023.
Also Read:
నాగ్‌పుర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) రెగ్యులర్, డిప్యూటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ(గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తులను గూగుల్ ఫాం ద్వారా సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సీఈఈఆర్ఐ నోటిఫికేషన్, సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐలో సైంటిస్ట్ పోస్టులు, సైంటిస్ట్ పోస్టులు
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 608 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మంగళూరు ఎంఆర్‌పీఎల్‌లో 50 నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టులు, వివరాలు ఇలా!
మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..