నిన్న పశ్చిమ విదర్భ నుండి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూన్ 1) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు వాయువ్య మరియు నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 49 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. 


రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. 


ఏపీలోని 15 మండలాల్లో, రేపు 302 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్ర, శనివారం రెండురోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే  అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.