న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 60
పోస్టుల కేటాయింపు: జనరల్- 31, ఎస్సీ- 09, ఎస్టీ- 05, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 11, ఈడబ్ల్యూఎస్- 04. ఇందులో 09 పోస్టులు దివ్యాంగులకు
* డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్: రూ.15,600-39,100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.02.2024.
ALSO READ:
CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు, వీరిక ప్రత్యేకం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
NLC India Limited Notification: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 632 గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
121 కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఈ అర్హతలుండాలి
UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్పెషలిస్ట్ గ్రేడ్ III, సైంటిస్ట్ B, అసిస్టెంట్ జువాలజిస్ట్ & అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.