దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(నెస్ట్స్‌)' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,329 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 6,329.

➥ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు

➥ హిందీ: 606 పోస్టులు

➥ ఇంగ్లిష్: 671 పోస్టులు

➥ మ్యాథ్స్‌: 686 పోస్టులు

➥ సోషల్‌ స్టడీస్‌: 670 పోస్టులు

➥ సైన్స్: 678 పోస్టులు

➥ బెంగాలీ: 10 పోస్టులు

➥ గుజరాతీ: 44 పోస్టులు

➥ కన్నడ: 24 పోస్టులు

➥ మలయాళం: 02 పోస్టులు

➥ మణిపురి: 06 పోస్టులు

➥ మరాఠీ: 52 పోస్టులు

➥ ఒడియా: 25 పోస్టులు

➥ తెలుగు: 102 పోస్టులు

➥ ఉర్దూ: 06 పోస్టులు

➥ మిజో: 02 పోస్టులు

➥ సంస్కృతం: 358 పోస్టులు

➥ సంతాలి: 21 పోస్టులు

➥ మ్యూజిక్‌: 320 పోస్టులు

➥ ఆర్ట్‌: 342 పోస్టులు

➥ పీఈటీ (మెన్): 321 పోస్టులు 

➥ పీఈటీ (ఉమెన్): 345 పోస్టులు

➥ లైబ్రేరియన్: 369 పోస్టులు

➥ హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు

➥ హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు

అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44,900-1,42,400/ రూ.35,400-1,12,400; హాస్టల్ వార్డెన్‌కు రూ.29,200-92,300.

పరీక్ష విధానం: ఓఎంఆర్‌ ఆధారిత(పెన్‌ పేపర్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2023. 

Website

                                 Notification: 

                               

ALSO READ:

గురుకుల నియామ‌క పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?తెలంగాణలో గురుకుల నియామ‌క ప‌రీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగ‌స్టు 1 నుంచి 22 వ‌ర‌కు కంప్యూట‌ర్ ఆధారిత రాత ప‌రీక్షలు జరగాల్సి ఉండగా.. ఆగస్టు 23 వరకు నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 24న విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది.పరీక్షల కొత్త షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial