మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులని భర్తీ చేయనున్నారు. పదో తరగతి, డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 నుంచి ఫిభ్రవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 150
* అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (E&T) (ట్రైనీ) గ్రేడ్-సి: 09 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ (కనీస 3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్)(ఎక్స్‌కేవేషన్) (ట్రైనీ) గ్రేడ్-సి: 59 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ (కనీస 3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 82 పోస్టులు(ఎక్స్‌కేవేషన్- 48, ఎలక్ట్రికల్ & మెకానికల్- 34)
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ (కనీస 3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 5.02.2024 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్షా విధానం: ఒక్కో పోస్టుకు ప్రత్యేకంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 90 నిమిషాల వ్యవధికి 100 మార్కులతో ఉంటుంది(ఒక సిట్టింగ్‌లో), రెండు విభాగాలు (సెక్షన్-ఎ & సెక్షన్-బి); సెక్షన్ 'A'లో 70 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో టెక్నికల్ నాలెడ్జ్ పరిజ్ఞానం (డిసిప్లిన్ రిలేటెడ్) మరియు సెక్షన్ 'B'లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్ & మెంటల్ ఎబిలిటీ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 01 మార్కు ఉంటుంది మరియు తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు లేవు. ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఇవ్వబడవు. ప్రశ్నపత్రం బైబిలింగ్వల్ అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. హిందీ వెర్షన్‌లో ఏదైనా లోపం/అస్పష్టత ఉంటే, ప్రశ్న యొక్క ఆంగ్ల వెర్షన్ చెల్లుబాటు అవుతుంది.
బేసిక్ పే: నెలకు రూ.47,330.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.01.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2024.