న్యూఢిల్లీలోని నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీఏ(మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్/ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్/ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్ వెల్లడైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 41
* యంగ్ ప్రొపెషనల్-I పోస్టులు(మార్కెటింగ్)
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
➥ ఆంధ్రప్రదేశ్: 02
➥ అరుణాచల్ ప్రదేశ్: 01
➥ అస్సాం: 01
➥ బీహార్: 01
➥ ఛత్తీస్‌గఢ్: 01
➥ గోవా: 01
➥ గుజరాత్: 02
➥ హర్యానా: 01
➥ హిమాచల్ ప్రదేశ్: 01
➥ కర్ణాటక: 02
➥ కేరళ: 02
➥ మధ్యప్రదేశ్: 02
➥ మహారాష్ట్ర: 02
➥ మణిపూర్: 01
➥ మేఘాలయ: 01
➥ ఢిల్లీ: 04
➥ మిజోరం: 01
➥ నాగాలాండ్: 01
➥ రాజస్థాన్: 01
➥ సిక్కిం: 01
➥ తమిళనాడు: 01
➥ త్రిపుర: 01
➥ ఉత్తరప్రదేశ్: 02
➥ ఉత్తరాఖండ్: 01
➥ పశ్చిమ బెంగాల్: 01
➥ అండమాన్ నికోబార్: 01
➥ దాద్రా నగర్ హవేలీ: 01
➥ జమ్మూ & కాశ్మీర్: 01
➥ లఢఖ్: 01
➥ లక్షద్వీప్: 01
➥ పుదుచ్చేరి: 01
అర్హత: ఎంబీఏ(మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్/ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్/ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: 2-3 సంవత్సరాల పోస్ట్ అర్హత మార్కెటింగ్ అనుభవం. బ్యాంకులు/ఆర్థిక సంస్థలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
ఒప్పంద కాలం: 3 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: NCDC అకడమిక్ రికార్డులు/అనుభవం మొదలైన వాటి ఆధారంగా ప్రాథమిక షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ/వ్యక్తిగత డిస్కషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.50,000.
ఈమెయిల్: career@ncdc.in.
దరఖాస్తు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్ వెల్లడైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ:
ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్ & డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 363 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, అర్హత పరీక్షలో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
గురుగ్రామ్(హరియాణా)లోని రైట్స్(RITES) లిమిటెడ్- ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(Apprenticeship Training)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్/నాన్-ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ (Diploma Apprentice), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice) ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు సంబంధిత వెబ్‌పోర్టల్‌ల ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు డిసెంబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.