భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (NCCR) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ప్రాజెక్టు సైంటిస్ట్ (1, 2, 3), సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేయనుంది.
ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్ విధానాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 20వ తేదీతో ముగియనుంది. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఆగస్టు 27 వ తేదీలోగా పంపాలని తెలిపింది. మరిన్ని వివరాల కోసం https://www.nccr.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఖాళీల వివరాలు..
ప్రాజెక్టు సైంటిస్ట్ 1: ఇందులో మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా.. ఎస్సీ అభ్యర్థులకు 4, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ 12 పోస్టులను కేటాయించింది. వీరికి నెలవారీ వేతనం రూ.56,000తో పాటు హెచ్ఆర్ఏ ఉంటుంది.
ప్రాజెక్టు సైంటిస్ట్ 2: ఈ విభాగంలో 35 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి నెల వేతనం రూ.67,000తో పాటు హెచ్ఆర్ఏ ఉంటుంది.
ప్రాజెక్టు సైంటిస్ట్ 3: ఇందులో మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. నెల జీతం రూ.78,000తో పాటు హెచ్ఆర్ఏ ఉంది.
సీనియర్ రీసెర్చ్ ఫెలో: మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ అభ్యర్థులకు 1, ఓబీసీలకు 1, జనరల్ 2 పోస్టులు ఉన్నాయి. వేతనం నెలకు రూ.35,000తో పాటు హెచ్ఆర్ఏ ఉంది.
ఫీల్డ్ అసిస్టెంట్: ఇందులో 9 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 4 ఉన్నాయి. వేతనం రూ.20,000తో పాటు హెచ్ఆర్ఏ కేటాయించారు.
టెక్నికల్ అసిస్టెంట్: ఒక పోస్టు ఉంది. వేతనం రూ.20,000తో పాటు హెచ్ఆర్ఏగా ఉంది.
విద్యార్హత వివరాలు..
ప్రాజెక్టు సైంటిస్ట్ (1, 2, 3) పోస్టులను మెరైన్ బయాలజీ, ఓషియన్ అబ్జర్వేషన్స్, కోస్టల్ జియో మార్ఫాలజీ అండ్ మ్యాపింగ్ తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్), మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం, వివిధ నైపుణ్యాలు ఉండాలి.
సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను మెరైన్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. కాబట్టి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. నెట్/ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్/ గేట్ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా అవసరం.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబందిత పనిలో అనుభవంతో పాటు ఈత వచ్చి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) పోస్టులకు కెమిస్ట్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
పోస్టుల ఆధారంగా వయో పరిమితి వేర్వేరుగా ఉంది. 32 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులని పేర్కొంది. రిజర్వేషన్ల ఆధారంగా ఇందులో సడలింపులు ఉంటాయి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుల చిరునామా..
అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసిన దరఖాస్తులను "ది డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (National Centre for Coastal Research), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, సెకండ్ ఫ్లోర్, ఎన్ఐఓటీ క్యాంపస్, వెలాచెరీ తంబరం మెయిన్ రోడ్, పల్లికారనై, చెన్నై, 600100" చిరునామాకు పోస్టు చేయాలి.