ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 281 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 281


ట్రేడులు: ఫిట్టర్, మేసన్ (బీసీ), ఐ&సీటీఎస్‌ఎం, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్‌&ఏసీ, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, షిప్‌రైట్‌(వుడ్), టైలర్, వెల్డర్, రిగ్గర్, ఫోర్జర్ & హీట్ ట్రీటర్, షిప్ రైట్ (స్టీల్).


అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 14 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 03.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.07.2023.


Notification  


Website



Also Read:


హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిసెర్చ్ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) వివిధ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌)లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో జూన్ 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..