విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ 2023-24 బ్యాచ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 275 అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. పదోతరగతితో పాటు సంబంధిత ఫీల్డ్/ట్రేడ్‌లో ఐటీఐ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్, మెరిట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 275
🌟 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలు
➽ ఎలక్ట్రీషియన్: 21
➽ ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 36
➽ ఫిట్టర్: 33
➽ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 10
➽ మెషినిస్ట్: 12
➽ పెయింటర్(జనరల్): 12
➽ ఆర్ & ఏసీ మెకానిక్: 15
➽ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్): 15
➽ కార్పెంటర్: 27
➽ ఫౌండ్రీమ్యాన్: 05
➽ మెకానిక్(డీజిల్): 23
➽ షీట్ మెటల్ వర్కర్: 33
➽ పైప్ ఫిట్టర్: 23
➽ మెకానిక్ మెషిన్ టూల్ నిర్వహణ: 10
అర్హత: అభ్యర్థులు పదొవతరగతితో పాటు సంబంధిత ఫీల్డ్/ట్రేడ్‌లో ఐటీఐ(NCVT/ SCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 02.04.2009న లేదా అంతకు ముందు జన్మించిన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ బ్యాచ్ 2023-24 దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్టైపెండ్: నిబంధనల ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్, మెరిట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైపులో 50 ప్రశ్నలకు రాతపరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్: 20, జనరల్ సైన్స్: 20, జనరల్ నాలెడ్జ్: 10 ప్రశ్నలు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు ఒకటిన్నర(1½) మార్కులు ఉంటాయి.
పరీక్ష కేంద్రం: నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్, విశాఖపట్నం.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపాల్పిన చిరునామా:
The Officer-in-Charge (for Apprenticeship),
Naval Dockyard Apprentices School,
VM Naval Base S.O., P.O.,
Visakhapatnam - 530 014, Andhra Pradesh.
ముఖ్యమైన తేదీలు:
➥ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 02.01.2023
➥ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 09.01.2023
➥అన్ని ట్రేడ్‌ల కోసం రాత పరీక్ష తేదీ: 28.02.2023
➥రాత పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: 03.03.2023
➥ఇంటర్వ్యూ తేదీ: 06, 07, 09, & 10.03.2023
➥మెడికల్ ఎగ్జామినేషన్ తేదీ: 16 నుండి 28.03.2023 వరకు
➥ శిక్షణ ప్రారంభం తేదీ: 02.05.2023
Also Read:
కేంద్రీయ విద్యాలయాల్లో 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు, వివరాలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 6414 ప్రైమరీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 2599 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 1731 పోస్టులు, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు 641 పోస్టులు, ఎస్సీ-962 పోస్టులు, ఎస్టీ-481 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..