దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 6414 ప్రైమరీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 2599 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 1731 పోస్టులు, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు 641 పోస్టులు, ఎస్సీ-962 పోస్టులు, ఎస్టీ-481 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు...


ప్రైమరీ టీచర్: 6414 పోస్టులు


అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). (లేదా) సీనియర్ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనలప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.



జీత భత్యాలు: రూ.35,400-రూ.1,12,400.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 


ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.


Notification


Website 


Also Read:


తెలంగాణలో 'గ్రూప్-4' నోటిఫికేషన్ విడుదల, 9168 ఉద్యోగాల భర్తీ! దరఖాస్తు ఎప్పుడంటే?
నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 260 ఉద్యోగాలు, ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత! జీతమెంతో తెలుసా?
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) యూనిట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 260 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...