భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్‌టీఆర్‌ఓ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 182 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈపోస్టుల భర్తీకి డిసెంబరు 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 182


విభాగాలు: ఏవియేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్.


1) ఏవియేటర్-2: 22 పోస్టులు


అర్హత: ఏవియేటర్2 పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్/టెక్నాలజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.


2) టెక్నికల్ అసిస్టెంట్: 160 పోస్టులు


అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: ఏవియేటర్ పోస్టులకు నెలకు రూ.56,100 - రూ.1,77,500;  టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.44,900-రూ.1,42,400 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు చివరితేది: 21.01.2023.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌లో మాత్రమే.


Notification


Online Application


Website 


Also Read


విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలివే!
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎన్ పీడీసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...