NMDC Executive Trainee Recruitment Notification 2024: హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) సంస్థ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఫైనాన్స్, కమర్షియల్ విభాగాల్లో 12 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICMAI) నుంచి గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు చేపడతారు. సరైన అర్హతలున్నవారు జులై 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


ఉద్యోగాలకు ఎంపికైనవారు ఎన్‌ఎండీసీ ప్రాజెక్టులు, యూనిట్లలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.15.7 లక్షల వార్షిక వేతనం ఇస్తారు. ఎం2 గ్రేడ్ ఆఫ్ స్కేల్ పే కింద రూ.50,000-రూ.1,60,000 వేతనం ఉంటుంది. విజయవంతంగా 6 నెలల శిక్షణ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్) హోదాలో అభ్యర్థులకు రూ.60,000-రూ.1,80,000 మధ్య వేతనం ఇస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఐసీఎంఏఐ ఫైనల్ మార్కుల షీట్, సర్టిఫికేట్లు; డిగ్రీ మార్కుల షీట్, సర్టిఫికేట్లు, పదోతరగతి మార్కుల సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.  


వివరాలు..


* ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు


ఖాళీల సంఖ్య: 12


విభాగాలవారీగా ఖాళీలు: ఫైనాన్స్-06, కమర్షియల్-06.


అర్హత: ఐసీఎంఏఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.


వయోపరిమితి: 27 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 30 సంవత్సరాల వరకు; ఎస్సీ, ఎస్టీకు 32 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


జీతభత్యాలు: ఎం2 గ్రేడ్ ఆఫ్ స్కేల్ పే కింద రూ.50,000-రూ.1,60,000 వేతనం ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్) హోదాలో అభ్యర్థులకు రూ.60,000-రూ.1,80,000 మధ్య వేతనం ఇస్తారు.


ఇంటర్వ్యూ సమయంలో తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..


➥ ఐసీఎంఏఐ ఫైనల్ మార్కుల షీట్ సర్టిఫికేట్.


➥ డిగ్రీ మార్కుల షీట్, సర్టిఫికేట్.


➥ పదోతరగతి మార్కుల సర్టిఫికేట్.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2024.


ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరితేది: 04.07.2024. 


Online Application (GoogleForm)


Website




ALSO READ:


ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ప్రత్యేకం
భారత నావికాదళంలో సెయిలర్ (డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ)/ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత క్రీడాంశంలో అభ్యర్థులకు పరీక్ష (Sports Trail), దేహదారుఢ్య పరీక్షలు (Physical Fitness Test), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...