NIT Warangal Jobs: వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!

దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

Continues below advertisement

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. 

Continues below advertisement

వివరాలు..

మొత్తం ఖాళీలు: 100

పోస్టుల కేటాయింపు: జనరల్-38, ఈడబ్ల్యూఎస్-18, ఓబీసీ-26, ఎస్సీ-10, ఎస్టీ-08.

పోస్టుల వారీగాఖాళీలు..

➥ ప్రొఫెసర్: 12

➥ అసోసియేట్ ప్రొఫెసర్: 52. 

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-I): 13.

➥అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 14.

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 9.

విభాగాలవారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్ - 16, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 06, మెకానికల్ ఇంజినీరింగ్ - 05, ఈసీఈ - 11, మెటలర్జికల్ ఇంజినీరింగ్ - 08, కెమికల్ ఇంజినీరింగ్ - 08, సీఎస్ఈ - 26, బయోటెక్నాలజీ - 04, మ్యాథమెటిక్స్ - 04, ఫిజిక్స్ - 04, హ్యుమానిటిస్ - 01, ఎస్‌వోఎమ్ - 06, సీసీపీడీ - 01.   

అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీటెక్/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ ఎంఎస్సీ/ పీజీ/ ఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 35-50 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైనతేదీలు..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.12.2022.

దరఖాస్తు చివరి తేది: 25.01.2023.

Notification 

Online Application

Website 

Also Read:

ఎస్‌బీఐలో 1438 ఉద్యోగాలు, వీరికి బంపరాఫర్! నెలకు రూ.40 వేల వరకు జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. 2023, జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెండు స్టాచ్యుటరీ పోస్టులు, గ్రూప్-ఎ విభాగంలో 6 పోస్టులు, గ్రూప్-బి విభాగంలో 21 పోస్టులు, గ్రూప్-సి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola