2022 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది విడుదలైన పలు సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. అయితే, తెలుగు టాప్ హీరోల్లో కొందరికి వరుస విజయాలు దక్కగా, మరికొందరికి వరుస ఫ్లాఫులు పలకరించాయి. ఏడాది ఏ హీరో ఎలాంటి ప్రతిభ కనబర్చారో చూద్దాం..
ప్రభాస్
‘రాధేశ్యామ్’తో ఈ ఏడాదిని ప్రారంభించిన ప్రభాస్ కు తొలి సినిమానే గట్టి దెబ్బకొట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాపులలో ఒకటిగా నిలిచింది. అప్పటికే ‘సాహో’తో డిజాస్టర్ చవిచూసినప్పటికీ, ఈ సినిమా మరింత దారుణంగా ఆడింది. ఈ సినిమాతో మళ్లీ ప్రభాస్ ఎవరీకీ అందనంత రేంజికి వెళ్తాడని భావించినా, అంచనాలు తప్పాయి. ప్రస్తుతం వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్, వచ్చే సినిమాతో సాలిడ్ హిట్ తగలకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఓపెనింగ్స్ కింగ్ అని మళ్లీ నిరూపించుకున్నారు. ’భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి వారంలో భారీ ఓపెనింగ్ సాధించింది. ఏపీలో టిక్కెట్ ధర కారణంగా ఈ చిత్రం పెద్దగా వసూళ్లను సాధించలేకపోయింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఎబౌ యావరేజ్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్‌కి ఇది మంచి సంవత్సరంగా చెప్పొచ్చు.
ఎన్టీఆర్
‘RRR’ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. అయితే, రాజమౌళి సినిమాలో ఇద్దరు హీరోల మధ్య బ్యాలెన్స్ ను కొనసాగించడంలో విఫలమయ్యాడు. వాస్తవానికి ఎన్టీఆర్ అభిమానులు కూడా అలాగే భావించారు. ‘RRR’ సినిమా కోసం ఎన్టీఆర్ 5 ఏళ్లు వెచ్చించినా ప్రేక్షకులతో పాటు అభిమానులకు సంతృప్తి లేదు. ఎన్టీఆర్ చక్కటి నటనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.
రామ్ చరణ్
‘RRR’తో రామ్ చరణ్ అద్భుత గుర్తింపు పొందాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాడు. కానీ, ‘ఆచార్య’తో ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. మొత్తంగా 2022 చెర్రీగా మంచి సంవత్సరంగానే మిగిలింది.
మహేష్ బాబు
‘RRR’, ‘KGF2’ సినిమాలు ఉన్నప్పటికీ ‘సర్కారు వారి పాట’తో సత్తా చాటాడు. ఈ సినిమా కూడా ‘ఆచార్య’ మాదిరిగానే డిజాస్టర్ అవుతుందని భావించినా, మొత్తంగా హిట్ బాట పట్టించాడు మహేష్. ఆయనకు ఈ సంవత్సరం బాగానే కలిసి వచ్చింది.
చిరంజీవి
2022 మెగాస్టార్ చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. ‘ఆచార్య’ డిజాస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్స్‌ను పొందడంలో విఫలమైంది. ‘గాడ్‌ఫాదర్’కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా ఓపెనింగ్స్‌ను పొందడంలో విఫలమైంది. అయితే, ఓటీటీలో ‘గాడ్‌ఫాదర్’కు మంచి వ్యూసే వచ్చాయ్.
అల్లు అర్జున్
ఈ ఏడాది బన్నీకి సంబంధించిన ఏ సినిమా రిలీజ్ కాలేదు. కానీ, ‘పుష్ప’ సినిమా జనవరి వరకు నడిచింది. ‘పుష్ప’తో ఆయన ఓ రేంజిలో గుర్తింపు వచ్చింది. హిందీలో అల్లు అర్జున్ మార్కెట్ పెరిగింది. ‘ పుష్ప’ బృందం ఆ సినిమాను రష్యాలో విడుదల చేసింది. అయితే, అక్కడ డిజాస్టర్ గా మిగిలింది.
2022 ఏ హీరోకు పెద్దగా కలిసి రాలేదు. రామ్ చరణ్ ‘ఆచార్య’తో హిట్ అందుకుంటే తనే టాప్ లో నిలిచేవారు. చిరంజీవి ఈ సంవత్సరం రెండు డిజాస్టర్లతో ర్యాంకింగ్స్ లో చివరి స్థానంలో నిలిచారు.
Read Also: రేటింగ్ రానప్పుడు కొనడం ఎందుకు? ఓటీటీల హవాతో సినిమాల కొనుగోలుకు టీవీ ఛానెళ్ల వెనుకడుగు!