హరియాణా రాష్ట్రం కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.



వివరాలు...

మొత్తం ఖాళీలు: 57

1) జూనియర్ ఇంజినీర్(సివిల్): 03


2) జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01


3) స్టూడెంట్స్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్: 01


4) లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్: 01


5) సీనియర్ స్టెనోగ్రాఫర్: 01


6) స్టెనోగ్రాఫర్: 01 


7) సీనియర్ అసిస్టెంట్: 06


8) జూనియర్ అసిస్టెంట్: 03


9) టెక్నికల్ అసిస్టెంట్: 05


10) సీనియర్ టెక్నీషియన్: 14


11) టెక్నీషియన్: 14


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/ఐటీఐ/డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 27-33 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.21,700-రూ.1,12,400.


దరఖాస్తు చివరితేది: 28.02.2023.


Notification


Online Application


                                   


Also Read: 


ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.   
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 'టెన్త్' అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు, 451 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి - దరఖాస్తు ప్రారంభం!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమైంది. అభ్యర్థుల ఫిబ్రవరి 22 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనంగా ఇస్తారు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియ‌న్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...